ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెసు పార్టీ తరఫున రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీ తరఫున స్మృతి ఇరానీ, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుమార్ విశ్వాస్ పోటీ చేయనున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది. స్మృతి ఇరానీ పోటీపై కుమార్ విశ్వాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెథీలో నటులు బరిలోకి దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అమెథీలో ఇప్పటికే ఓ నటుడు ఉన్నాడని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. అతను నియోజకవర్గానికి ఇలా వచ్చి.. అలా చేతులు గాల్లోకి ఊపి వెళ్తారని.. ఇప్పుడు కొత్తగా బిజెపి తరఫున పోటీకి కోసం నటి వచ్చారన్నారు.
కుమార్ విశ్వాస్ వ్యాఖ్యల పైన స్మృతి ఇరానీ స్పందించారు. ఎఎపి నేత కుమార్ విశ్వాస్ తరుచూ స్థాయికి తక్కువ మాటలు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. తాను అమేథీలో కాంగ్రెసు పార్టీ పైన పోటీకి దిగుతున్నానని, బి టీంతో కాదని ఎఎపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెసు తోక పార్టీని పట్టించుకోనన్నారు.
అమేథీలో యాంటీ రాహుల్ వేవ్ ఉందని స్మృతి ఇరానీ చెప్పారు. తాను అభివృద్ధి, సంక్షేమం అంశాలతో ప్రజలలోకి వెళ్తానని ఆమె చెప్పారు. మహిళలను గౌరవించడం తెలియని కుమార్ విశ్వాస్ నుండి అంతకంటే మంచి మాటలు ఆశించలేమని స్మృతి చెప్పారు.
కాగా, బిజెపి స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన అనంతరం సోమవారం ఆమె స్పందిస్తూ... కుటుంబం పేరుతో, అమేథీ ప్రజలు చాలాకాలంగా అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్నారని, ఇది చాలా సిగ్గుపడవల్సిన విషయమన్నారు.
కాగా, బిజెపి స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన అనంతరం సోమవారం ఆమె స్పందిస్తూ... కుటుంబం పేరుతో, అమేథీ ప్రజలు చాలాకాలంగా అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్నారని, ఇది చాలా సిగ్గుపడవల్సిన విషయమన్నారు.
తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో దేశంలో మార్పు రానుందని స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు. స్మృతి ఇరానీ పై కుమార్ విశ్వాస్ వ్యాఖ్యల పట్ల సుబ్రహ్మణ్య స్వామి కూడా మండిపడ్డారు. స్మృతి అభ్యర్థిత్వం నేపథ్యంలో కుమార్ ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు.
స్మృతి ఇరానీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సన్నిహితురాలు. రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించకపోయినా కాంగ్రెసు ప్రధాని అభ్యర్థి అనే విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీని లక్ష్యం చేసుకుని స్మృతి ఇరానీని పోటీకి దించాలని బిజెపి నాయకత్వం నిర్ణయించుకుంది.
ఆమేథీ నుంచి రాహుల్ గాంధీ 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. ఆయనను ఓడించడానికి కుమార్ విశ్వాస్ ఆమేథీలోనే మకాం వేశారు. బిజెపి తరఫున స్మృతి ఇరానీ పోటీ చేయనున్న స్థితిలో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది.
మరోవైపు, రాయబరేలీలో సోనియా గాంధీపై పోటీ చేసే అభ్యర్థిగా సుప్రీంకోర్టు న్యాయవాది అజయ్ అగర్వాల్ పోటీ చేయనున్నారు.
Thanks to namobharat.in
No comments:
Post a Comment